నవతెలంగాణ-డిచ్ పల్లి
డిచ్ పల్లి మండల కేంద్రంలోని ఘన్ పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్బైఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (అర్ఎస్ఈటిఐ ) బుధవారం నుండి నిర్వహించే ఎలక్ట్రాషియన్, 19నుండి నిర్వహించే సిసిటివి ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని అ సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఈ శిక్షణ ఎలక్ట్రిషియన్ 30 రోజులు,సిసి టివి శిక్షణ 19నుండి 13రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉచిత శిక్షణతో పాటుగా ఉచిత భోజన సదుపాయం, హాస్టల్ వసతి కల్పించాడం జరుగుతుందని శ్రీనివాస్ వివరించారు. శిక్షణా అనంతరం ధ్రువీకరణ పత్రం అందజేస్తామని, శిక్షణకు కావాల్సిన అర్హతలు 19 నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండి నిజామాబాద్, మరియు కామారెడ్డి జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత యువకులు ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ ఎస్ శ్రీనివాస్ పేర్కొన్నారు.శిక్షణ కు వచ్చే వారు తమవేంట ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, 10 వ తరగతి ధ్రువీకరణ పత్రం, ఐదు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు తమ వేంట తెచ్చుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఏదైనా సమాచారం కోసం ఎస్బిఐ శిక్షణా కేంద్రం వెలుగు ఆఫీసు ప్రక్కన ఘన్పూర్ రోడ్ డిచ్ పల్లి లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వచ్చి నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు 08461 295428 ఫోన్ నంబర్ లలో సంప్రదించలన్నరు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 05:50PM