- పర్యటన వివరాలు ప్రకటించిన శ్రీరామమూర్తి, బండి...
నవతెలంగాణ - అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు మండల వ్యాప్తంగా మూడురోజులు పాటు పర్యటించడం తో పాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు,ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఆ మేరకు ఎమ్మెల్యే మెచ్చా టూర్ షెడ్యూల్ ను ఎం.పి.పి జల్లిపల్లి శ్రీరామమూర్తి,బీఆర్ఎస్ మండల అద్యక్షులు బండి పుల్లారావు లు ఆదివారం బహిర్గతం చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజక కేంద్రమైన అశ్వారావుపేట మండలం లో తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి సోమవారం నుండి బుధవారం వరకు పర్యటిస్తారని తెలిపారు. కావున ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు, అభిమానులు,పార్టి శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.గతంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా ప్రతి గ్రామం,ప్రతి పల్లె అభివృద్ధి పథంలో ముందుకు దూసుకు పోతుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో అశ్వారావుపేట మండలంలో మునుపెన్నడూ లేని విధంగా అధికా మొత్తంలో నిధులను తెప్పించి అభివృద్ధి చేయించిన ఘనత ఎమ్మెల్యే మెచ్చా.నాగేశ్వర రావు కే సొంతం అని అన్నారు.
సోమవారం గంగారం,రామన్న గూడెం లలో సీసీ రోడ్లు కు శంకుస్థాపన చేస్తారని,స్థానిక వ్యవసాయ కళాశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన వసతి గృహం భవనం సముదాయం ను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి,ఉపరితల రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లు తో ప్రారంభిస్తారని అన్నారు.
మంగళవారం అచ్యుతాపురం,దిబ్బగూడెం,మద్దికొండ జమ్మిగూడెం, కేశాప్పగూడెం, వినాయకపురం, వినాయకపురం గ్రామంలోనే కామయ్యనగర్, పాతూరు, అసుపాక, ఆసుపాక కాలనీ, ఉసుర్లగూడెం, మావిళ్ళవారిగూడెం, తిరుమల కుంట, రెడ్డిగూడెం సుద్దగోతుల గూడెంలలో సీసీ రోడ్లను ప్రారంభించ నున్నారు.
బుధవారం నారంవారిగూడెం కాలనీ, నారంవారిగూడెం,పేరాయి గూడెం,అల్లిగూడెం, పాపిడిగూడెం, ఉట్లపల్లి లలో సీసీ రోడ్ల ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కార్యదర్శి జుజ్జూరపు వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 09:03PM