నవతెలంగాణ-ధర్మసాగర్
దేశ భవిష్యత్తు యువత పైనే ఆధారపడి ఉందని ఎమ్మెల్యే డాక్టర్ కొండ రాజయ్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ మంత్రిత్వ శాఖ ద్వారా తెలంగాణ క్రీడా సంబురాలలో భాగంగా మండల స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయి లో నిర్వహించే సీఎం కప్-2023 మండల స్థాయి క్రీడా పోటీలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. మండల స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ నిమ్మ కవిత రెడ్డి, ఎంపీడీవో జోహార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల 15 నుండి 17 వరకు మండల స్థాయిలో ఈ నెల 22 నుండి 24 వరకు జిల్లా స్థాయిలో 28 నుండి 31 వరకు రాష్ట్రస్థాయిలో సీఎం కప్-2023 క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సీఎం కప్ ద్వారా 18 రకాల క్రీడలు మండల స్థాయి, జిల్లాస్థాయి మరియు రాష్ట్రస్థాయిలో క్రీడా పోటీలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.సీఎం కప్-2023 లో భాగంగా మండల స్థాయిలో అథ్లెటిక్స్,ఫుట్బాల్, కబడ్డీ,ఖో-ఖో,మరియు వాలీబాల్ ఐదు రకాల క్రీడలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సీఎం కప్ పేరిట క్రీడలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ క్రీడా పోటీలు మండల స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో నిర్వహించి,ఈనెల 29 న హైదరాబాదులో ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా తెలంగాణ క్రీడ సంబరాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, నియోజకవర్గ కోఆర్డినేటర్స్, మండల కోఆర్డినేటర్స్, సంబంధిత శాఖల అధికారులు - ఉద్యోగులు, క్రీడాకారులు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 15 May,2023 06:31PM