నవతెలంగాణ - ఆర్మూర్
మానవత్వం చాటిన న్యాయవాది పెద్దోళ్ల దేవన్నను పట్టణ బార్ అసోసియేషన్ తోటి న్యాయవాదులు మంగళవారం శాలువాతో సన్మానించారు. నందిపేట్ లోని రాంనగర్ కాలనీలో అద్దె ఇంట్లో ఉంటున్న 60 సంవత్సరాలు అనే మహిళ మృతి చెందగా, మృతదేహాన్ని తన కొడుకు అద్దె ఇంటికి తీసుకురాగా ఇంటి యజమాని తన ఇంట్లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకపోవడంతో అదే కాలనీలో ఉంటున్న న్యాయవాది దేవన్న అంత్యక్రియలు ముగిసేంతవరకు తన ఇంటిని వాడుకునేందుకు అవకాశం ఇచ్చి మానవత్వం చాటడం పట్ల బార్ సభ్యులు దేవన్నను అభినందించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు గటాడి ఆనంద్, జక్కుల శ్రీధర్, అల్జాపూర్ చంద్రప్రకాష్, కీర్తి సాగర్, గంట విప్లవ్ కిరణ్, గణేష్, చిలుక సుభాష్, చైతన్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 16 May,2023 07:17PM