నవతెలంగాణ - వీణవంక
వీణవంక మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో నూతనంగా బిఆర్ఎస్ పార్టీ కమిటీని గ్రామ ఉపసర్పంచ్ రెడ్డి శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఆసరి రవీందర్, ఉపాధ్యక్షుడిగా కాసగోని కుమారస్వామి, కార్యదర్శిగా గాజుల ఓంకార్, సంయుక్త కార్యదర్శిగా గాజుల రవీందర్, కోశాధికారిగా మండల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా వీణవంక రాములు, మండల చంద్రమౌలి, పులిపాక మల్లేష్, గాజుల రవీందర్, అవునూరి కుమారస్వామి, నమిలోజు కొండయ్య, ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఎమ్మెల్సీ, విప్ ఆదేశాల మేరకు నా నియామకానికి సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పార్టీ అప్పగించిన పనులను అమలు చేస్తూ పార్టీ గెలుపు కొరకు సాయి శక్తుల కృషి చేస్తానని ఆయన అన్నారు. నా మీద నమ్మకంతో నాకు అప్పగించిన బాధ్యతలను తూచా తప్పకుండా అభివృద్ధికి పాటుపడతానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులుగాజుల రవీందర్, రాజన్న, శంకర్, జగన్, కొండయ్య, అశోక్, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Tue April 01, 2025 01:59:31 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 17 May,2023 03:44PM