- విద్యార్థులపై తల్లిదండ్రుల శ్రద్ధ తప్పనిసరి
- స్కాలర్ షిపులు అందజేత
- ట్యురిటో సంస్థ అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి
నవతెలంగాణ-వీణవంక
ప్రతీ మనిషి అభివృద్ధి చెందాలంటే విద్య ఒక్కటే మార్గమని యఫ్ టీవీ, ట్యరిటో సంస్థల అధినేత పాడి ఉదయనందన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఆయన నివాసంలో రూ.6లక్షల విలువ గల తన సొంత డబ్బులతో 200మంది నిరుపేద విద్యార్థులకు స్కాలర్ షిప్ చెక్కులను ఆయన రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ సతీమణి శ్వేతతో కలిసి ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ విద్యార్థిపై తల్లిదండ్రుల శ్రద్ధ అవసరమని, లేకుంటే వారు ఉన్నతస్థితికి రాలేరని సూచించారు. ప్రతీ పిల్లవాని జీవితంలో డబ్బు సంపాదనకు కేవలం విద్య మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. తన సొంత ఊరిలో పేద విద్యార్థుల కోసం కంప్యూటర్ ఎడ్జుకేషన్ ప్రారంభించినప్పుడు దీంతో ఏం ఉపయోగమని చాలా మంది ఎగతాలి చేశారని, ప్రస్తుతం దాని ద్వారా 63 మంది నిరుపేద యువతులు పలు కంపెనీల్లో ఉద్యోగం పొందేలా చేసిందని గుర్తు చేశారు. సొంత ఊరి నుండే విదేశాల్లో ఉద్యోగం చేసేలా ఉపయోగపడిందని చెప్పారు. అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుండి బైజ్యూస్ క్లాసులను రూ.99 అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు వివరించారు. ఇలాంటి క్లాసులు వినడం వల్ల విదేశాల్లో సైతం ఇక్కడి ఉండే ఉద్యోగం చేసుకోవచ్చని పేర్కొన్నారు. మంచి స్కిల్స్ తో కూడిన విద్య అందించి ప్రతీ ఒక్కరిని అభివృద్ది చేయడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీణవంక మండల కో ఆప్షన్ సభ్యులు అబ్దుల్ హమీద్, మాజీ జెడ్పీటీసీ దసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, అమృత ప్రభాకర్, సమిండ్ల చిట్టీ, మాజీ ఉప సర్పంచ్ సమ్మిరెడ్డి, వెన్నంపల్లి నారాయణ, తాళ్ళపెళ్లి కుమారస్వామి, మంతెన శ్రీధర్, దాసారపు లోకేష్, వంశీకృష్ణ, సముద్రాల రమేష్, పస్తాం కుమార్, సిరిగిరి రాజశేఖర్,కూర రాజిరెడ్డి, రాకేష్, శ్రావణ్, కార్తీక్, ఉమేష్, తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 07:22PM