- సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రవి యాదవ్
నవతెలంగాణ - తాడ్వాయి
గొల్ల కురుమలకు నగదు పథకాన్ని అమలు చేయాలని సామాజిక న్యాయ వేదిక ములుగు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోరే రవి యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో తెలంగాణ యాదవ మహాసభ మండల అధ్యక్షులు చింతల మహిపాల్ అధ్యక్షతన యాదవ సోదరుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా కోరే రవి యాదవ్ హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం గొల్ల కురుమలకు రెండవ విడుత గొర్రెల పంపిణీ పథకం అమలు కు గొర్రెలకు బదులు దానికి సరిపడు నగదు ను అందించాలని కోరే రవి యాదవ్ కోరారు. గతంలో ఇచ్చిన గొర్రెల పథకం చాలా అవకతవకలతో అమలు జరిగిందని, అధికారులు మధ్యవర్తుల ప్రమేయం తో లబ్దిదారులు చాలా నష్టపోయారని అన్నారు. పర్సంటేజీలు తీసుకొని నాసి రకం గొర్రెల అందించి చేతులు దులుపుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం గొల్ల కురుమలకు మేలు చేయాలనే ఆలోచన ఉంటే ప్రతి గొల్ల కురుమ లబ్ది దారునికి గొర్రెలకు బదులుగా నగదు పథకాన్ని అందించి సహకారం చేయాలని రవి యాదవ్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో కట్ల ఓదెలు యాదవ్, చింతల నరేష్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, శ్రావణ్ కుమార్ యాదవ్, రఘుపతి అశోక్ యాదవ్, రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 09:06PM