నవతెలంగాణ - తాడ్వాయి
కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నర్సాపూర్(పిఏ) హెల్త్ వెల్నెస్ సెంటర్లో ఆయుష్మాన్ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రంజిత్ ఆధ్వర్యంలో ఆదివారం ఆరోగ్యమేళ కార్యక్రమం నిర్వహించారు. రుతుచక్ర పరిశుభ్రత, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పై ఎం యల్ హెచ్ పి (హెచ్ డబ్ల్యు సి) వైద్యులు డాక్టర్ ఎండి అస్పీయా, డాక్టర్ రవళి లు అవగాహన కల్పించారు. అనంతరం సానిటరీ నాప్కిన్స్, ఐరన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను గ్రామస్తులకు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరోగ్య మేళాను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని వైద్యుల సూచనలు పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రంగాపూర్ ఎం యల్ హెచ్ పి వైద్యులు డాక్టర్ సాయి చంద్, ఏఎన్ఎంలు చంద్రకళ, రాజేశ్వరి, ఆశాలు, వెల్నెస్ సెంటర్ల వైద్య సిబ్బంది, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 08:22PM