- విస్తుపోయిన ఉపాద్యాయులు...
- విచారంలో పిల్లలు...
నవతెలంగాణ - అశ్వారావుపేట
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండలంలో నిర్వహించబడుతున్న ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో బుధవారం విడుదలైన పదో తరగతి ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి.గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రెండు పాఠశాలలో పదోతరగతి ఫలితాలు దిగజారి పోయాయి. మండలంలోని 18 పాఠశాలలకు 529 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా 479 మంది ఉత్తీర్ణత సాధించారు.మొత్తం 50 మంది ఫెయిల్ కాగా 24 మంది ఆశ్రమం ఉన్నత పాఠశాలలు విద్యార్ధులు కావడం బాధాకరం. ఎ.హెచ్.ఎస్ గా పిలువబడే ఈ పాఠశాలలు మండలంలో అనంతారం,పెద్దవాగు ప్రాజెక్ట్,సున్నం బట్టి,భీముని గూడెం లో మొత్తం నాలుగు ఉన్నాయి.ఈ పాఠశాలకు చెందిన మొత్తం 109 మంది పరీక్ష రాయగా 85 మంది ఉత్తీర్ణత పొందారు.24 మంది పరీక్షల్లో తప్పారు.అంతే గాకుండా సున్నం బట్టి పాఠశాలలో 26 మందికి 16 పాస్ అయి 10 ఫెయిల్ కాగా,పెద్దవాగు ప్రాజెక్ట్ పాఠశాల లో 25 మంది కి 14 మంది పాస్ అయి 11 మంది ఫెయిల్ అయ్యారు.
ఈ ఫలితాలను చూసి ఉపాద్యాయులు విస్తుపోతుండగా,తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఆశ్రమ పాఠశాల విద్యా విధానం సాధారణ పాఠశాలలకు భిన్నంగా ఉంటుంది.పూర్తి స్థాయిలో బోధనా సిబ్బంది,24 గంటలు ఉపాద్యాయుల పర్యవేక్షణ ఉంటుంది.గిరిజనుల విద్యాభివృద్ధి కోసం ఐటిడిఎ ప్రత్యేక నిధులు హెచ్చించడం మే కాకుండా పౌష్టికాహారం అందిస్తుంది.క్రీడా మైదానాలు ఉంటాయి.విద్యార్ధి ప్రతీ రంగంలో రాణించడానికి ఐటిడిఎ పి.ఒ,సహాయ అధికారులు నిశిత పర్యవేక్షణ ఉంటుంది.ఇంతటి భద్రతల మధ్య విద్యాభ్యాసం చేసినా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం అధికారులు సైతం ఆలోచనలో పడ్డారు.
పలువురు ప్రధానోపాధ్యాయులు రీ వాల్యుయేషన్ చేయించడానికి ఉన్నతాధికారులను సంప్రదించినట్లు విశ్వసనీయ సమాచారం.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 11 May,2023 07:05PM