నవ తెలంగాణ -నవీపేట్: బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెట్టిన బిజెపి నాయకులపై పోలీసులకు బిఆర్ఎస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా మండల యువజన అధ్యక్షుడు సాయి కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్యే షకీల్ కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నాగేపూర్ ఉపసర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, అర్షద్, సాయి తేజ, శివ, సురేష్, లడ్డు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm