నవతెలంగాణ - దుబ్బాక రూరల్
హనుమాన్ అనుగ్రహంతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని పద్మనాభుని పల్లి సర్పంచ్ కండ్లకోయ పరశురాములు అన్నారు శుక్రవారం దుబ్బాక మండల పరిధిలోని పద్మనాభునిపల్లి గ్రామంలో హనుమాన్ స్వాములకు సర్పంచ్ భిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాధారణ వేసిన స్వాములు పాల్గొని బిక్షను స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పరశురాములు మాట్లాడుతూ.. హనుమంతుని కరుణాకటాక్షాలతో గ్రామ ప్రజలతో బాగుండాలని ఆకాంక్షించారు. హనుమాన్ స్వరూపులైన ఈ స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించడం సంతోషకరంగా ఉందని సర్పంచ్ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్యకర్త వేముల శ్రీనివాస్, స్వాములు కరుణాకర్, కనకయ్య, మహేందర్, అజయ్, తదితరులు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 04:46PM