నవతెలంగాణ - మద్నూర్
శుక్రవారం నాడు మద్నూర్‌లో ఎఫ్ పి ఓ కార్యాలయంలో ప్రత్యేక సమవేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రైతు ఉత్పత్తిదారుల సంఘంలో సభ్యత్వం తీసుకున్న రైతులకు సోయా విత్తనాలు అందజేయలని తీర్మానించడం జరిగింది. సోయ ఈ విత్తనాల రకాలు కే డి ఎస్ 726 రకం ధర 2200-ధృవీకరించబడిన విత్తనం. జెఎస్ 335. రకం ధర 2050 - సర్టిఫైడ్ సీడ్. జె ఎస్ 9305 రకం విత్తన ధర 2100 - సర్టిఫైడ్ సీడ్ రైతులకు అందజేయలని ఎన్ ఎస్ సి భారత ప్రభుత్వ రంగ సంస్థకు రూ. 5,05,500, డిడి రూపంలో అందించడం జరిగింది. త్వరలోనే ఈ విత్తనాలను రైతుల కు మద్నూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ద్వారా అందజేయడం జరుగుతుందని ఎఫ్ పి ఓ చైర్మన్ చాట్ల గోపాల్ ఒక ప్రకటన ద్వారా విలేకరులకు తెలిపారు ఈ ప్రత్యేక సమావేశంలో కంపెనీ డైరెక్టర్లు ద్రోణాచారి విజయ్ క్యాదర్ కుంట చంద్రకళ పటేల్ కుశాల్ రావు రామచందర్ సంజయ్ బాలాజీ పటేల్ రమేష్ రైతులు పాల్గొన్నారు అనంతరం ఇటీవల 10వ తరగతిలో 9.7 ర్యాంక్ సాధించిన రైతు బిడ్డ నాగంవర్ పూజకు మద్నూర్ ఎఫ్ పి ఓ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.