- పంచాయితీ కార్యదర్శుల సమ్మెను పరిష్కరించాలి
- సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్
నవతెలంగాణ కంటేశ్వర్
యూనియన్ పెట్టుకున్నందుకు సమ్మె చేస్తున్నందుకు తొలగిస్తామని నోటీసు ఉపసంహరించుకోవాలి అని పంచాయతీ కార్యదర్శుల సమ్మెను సమస్యలను పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల సమ్మె శిబిరంలో పంచాయతీ కార్యదర్శుల. సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. అనంతరం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. మీరు నిర్వహిస్తున్న సమ్మెకు రాష్ట్ర కమిటీ అండగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం వైఖరి సరైనది కాదని రాష్ట్రంలో పంచాయితీ కార్యదర్శులు తమ సర్వీసులు రెగ్యులరైజ్ చేయాలని ఏప్రిల్ 28 నుండి సమ్మె చేస్తున్నారు. వీరి సమస్యలు పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నది. పంచాయితీ కార్యదర్శులతో చర్చించి సామరస్యంగా పరిష్కరించకుండా అణిచివేత ధోరణికి పాల్పడుతున్నది. ఇందులో భాగంగా పంచాయితీరాజ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ది. 08-05-2023న నోటీస్ ఇస్తూ యూనియన్ పెట్టుకున్నందుకు సమ్మె చేస్తున్నందునః తొలగిస్తామని ఆదేశాలు జారీ చేశారు. ఈ నోటీస్ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పంచాయితీరాజ్ ఉద్యోగుల డిమాండ్ లను..రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చట్ట వ్యతిరేకంగా ఉంది. పంచాయితీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించకుండా యూనియన్లు పెట్టుకున్నారని చర్యలు తీసుకోవడం దుర్మార్గం. యూనియన్ పెట్టుకోవడం ఉద్యోగుల హక్కు ప్రభుత్వ ఉద్యోగులకు, పారిశ్రామిక కార్మికులకు ప్రతి ఒక్కరికి యూనియన్లు పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు ఉంది.పంచాయితీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తామని చెప్పలేదని, ఒకవేళ చేయాల్సి వస్తే కమిటీ వేసి ఉద్యోగుల పర్ఫామెన్స్ ఆధారంగా చేస్తామని అంటున్నారు. ఇది చాలా అన్యాయం, వెంటనే అందరి ప్రొబేషన్ పీరియడ్ డిక్లేర్ చేసి సర్వీసు రెగ్యులర్ చేయాలి. చట్ట వ్యతిరేకమైన నోటీస్ ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్ వి రమ సిఐటియు నిజామాబాద్ జిల్లా కార్యదర్శి నూర్జహాన్
పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ రాజు నవీన్ లక్ష్మీ పద్మ కవిత తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 05:55PM