మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
ఏర్గట్ల మండలంలోని తాళ్ళ రాంపూర్,తడపాకల్,తొర్తి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడానికి శుక్రవారం మంత్రి వేముల గ్రామాల్లో పర్యటించారు. ఇందులో భాగంగా 6 కోట్ల 43 లక్షల వ్యయంతో కమ్మర్ పల్లి నుండి తడపాకల్ వరకు బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులకు తాళ్ళ రాంపూర్ లో శంకుస్థాపన చేశారు.తొర్తి గ్రామంలో 1 కోటి 45 లక్షల వ్యయంతో స్లాబ్ కల్వర్టు బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ...ప్రతి పక్షాలకు ఛాలెంజ్ విసురుతున్నానని నియోజకవర్గంలో అభివృద్ధి జరగకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని,ప్రజలు అభివృద్ధికి మాత్రమే పట్టం కడతారని వారు అన్ని గమినిస్తున్నారని అన్నారు.ఏ పార్టీయో తెలియని ఒకాయన నన్ను హేళన చేసి మాట్లాడుతున్నాడని అతనికి ప్రజలే బుద్దిచెప్పే రోజులు ఇంకెంతో కాలం లేదని అన్నారు.అలాగే బీజేపీ పార్టీకి చెందిన ఎంపీ అరవింద్ నోరు తెరిస్తే తిట్టడమే పనిగా పెట్టుకున్నాడని ,అతను ప్రజలకు మంచి చేసే ఆలోచన చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.అలాగే మాకు ముఖ్యమంత్రి ఉన్నట్లే మీ బీజేపీ ప్రభుత్వానికి ప్రధాని ఉన్నాడని, మేము మా ముఖ్యమంత్రి దగ్గర నుండి నిధులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేసినట్లే మీరు కూడా మీ ప్రధానమంత్రి దగ్గర నుండి నిధులు తీసుకువచ్చి ప్రజలకు మంచి చేయాలని హితువు పలికారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉపేంధర్ రెడ్డి,జడ్పీటీసీ గుల్లే రాజేశ్వర్,వైస్ ఎంపీపీ సల్ల లావణ్య,బీఆర్ఎస్ మండలాధ్యక్షులు పూర్ణానందం,సర్పంచ్లు పత్తిరెడ్డి ప్రకాష్,కుండ నవీన్,తాళ్ళ రాంపూర్ పీఏసీఎస్ అధ్యక్షులు పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి,కోఆప్షన్ మెంబర్ అష్రాఫ్,పార్టీ కార్యకర్తలు,నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 08:56PM