నవ తెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో బొడ్రాయి విషయంలో చేతులు మారాయి అంటున్నా ఐదు లక్షలు గ్రామంలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా ఎవరి నోట విన్న ఐదు లక్షల వ్యవహారం గురించి ఏ టీ స్టాల్ దగ్గరైనా పాన్ డబ్బాల కాడ కాఫీ టీ హోటల్లో వద్ద ఈ టాపిక్ విస్తృతంగా వినిపిస్తోంది. అసలు ఎక్కడివి ఈ ఐదు లక్షలు ? రాంపూర్ బొడ్రాయి ప్రతిష్టాపన విషయంలో రాంపూర్ బొడ్రాయి కమిటీ మరియు పసర నాగారం గ్రామస్తులు బొడ్రాయి విషయమే చర్చించుకున్నారు. ఈ చర్చల్లో ఐదుగురు పెద్దమనుషులు పసర నాగారం నుండి చర్చల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు సదరు ఐదుగురు పెద్దమనుషులలో కొంతమంది సంబంధించిన సంతకాలు చేసిన కాపీ జిరాక్స్ సెంటర్లో దొరికిందని ఒక వ్యక్తి ఇంటి వద్ద సీక్రెట్ గా సంతకాలు చేయడం జరిగిందని హడావుడిలో జిరాక్స్ సెంటర్లో కాపీ మరిచిపోయారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో ఐదు లక్షల రూపాయలు ముట్టాయని పలువురు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో రాంపూర్ బొడ్రాయి కమిటీ సభ్యులను కూడా ఈ విషయమై వివరణ కోరడం జరిగింది. అలాంటిదేమీ లేదని వారు తెలిపారు. కానీ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయిన కూడా ఐదు లక్షల వ్యవహారం మాత్రం ఇంకా గ్రామస్తులకు నోళ్ళల్లో నానుతోంది. ఇంకా దీనిపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం నాడు కూడా కొందరిని గ్రామపంచాయతీ పిలిచి ఈ విషయమై విచారించినట్లు సమాచారం చివరకు ఏమవుతుందో వేచి చూడాల్సిందే మరి.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 12 May,2023 09:01PM