- లేనియెడల పోరాటాలను ఉదృతం చేస్తాం
- ఐకెపి విఓఏల ఉద్యోగుల సంఘం (సిఐటియు)
- సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్వి రమ డిమాండ్
నవతెలంగాణ - కంటేశ్వర్
ఐకెపి వివో ల సమ్మె చేస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని లేనియెడల ఉద్యమాలను ఉదృతం చేస్తామని ఐకెపి వివోఎలా ఉద్యోగుల సంఘం సిఐటియు రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలు ఎస్.వి.రమ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లాలో వి ఓ ఏ ల సమ్మె శిబిరాన్ని సందర్శించి అనంతరం సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎస్వీ రమ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో స్పేర్ సంస్థలో గత 20 సం॥రాలుగా గ్రామీణ ప్రాంతాలతో 17,965 మంది వివో ఏలు పనిచేస్తున్నారు. పేద, నిరుపేద మహిళలు ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. పేదలకు అన్ని రకాల లోన్స్ ఇప్పించడం, తిరిగి బ్యాంకులకు జమ చేయడంలో తమ బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ఇంతటి కీలకమైన పనులు నిర్వహిస్తున్న ఐకెపి విఓఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఏప్రిల్ 17వ తేదీ నుండి తెలంగాణ | ఐకెపి విఓఏల ఉద్యోగుల (సిఐటియు) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక జరుగుతున్న సమ్మెకు సిఐటియు సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నది. ఈ సందర్భంగా ఐకెపి కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో భాగంగానే ఉన్నప్పటికీ బిజెపి ప్రభుత్వం ఈ పథకానికి తీవ్ర అన్యాయం చేస్తున్నది. నిధులు ఇవ్వడం లేదు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా తీవ్ర అన్యాయానికి గురైన ఐకెపి విఓఏల సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నది. యూనియన్ రాష్ట్ర కమిటీ గత 9 సం॥లుగా అనేక రూపాల్లో ఆందోళన, పోరాటాలు, | టోకెన్ సమ్మెలు నిర్వహించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన లేదు. | అనివార్య స్థితిలో కొనసాగుతున్నది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ.. ఈ నిరవధిక సమ్మె పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం | తక్షణం చొరవ చేయాలని సిఐటియు కోరుతున్నది. సమ్మె కొనసాగుతున్నంత కాలం || సిఐటియు అనుబంధ యూనియన్లు, మండల, గ్రామస్థాయి సమన్వయ కమిటీలు సంఘీభావం తెలపాలని, సోదర ప్రజా సంఘాలు, ముఖ్యంగా మహిళా సంఘాలు సభ్యులు అండగా నిలవాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ కోరుతున్నది.సంఘాల పుస్తక నిర్వహణ కోసం ఎంపిక చేసిన ప్రభుత్వం ఈరోజు ఎన్నో |ఆన్లైన్ పనుల పేరుతో ఎస్ హెచ్ జి, వివో ట్రాన్సక్షన్స్, ఎస్ హెచ్ జి, వివో అకౌంటింగ్, ఎన్.ఆర్.ఎల్.ఎ, విపిఆర్పిలకే ప్రతిదీ ఇలాఎన్నో ఆన్లైన్ పనులు చేపిస్తున్నారు. వీటితో పాటుగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం వివో ఏలకు ముందుండి ప్రజల వద్దకు తీసుకువెళుతున్నారు. మరుగుదొడ్లు కట్టించడం, స్వచ్ఛభారత్, స్వచ్ఛ సర్వేక్షన్, | తడి పొడి చెత్త, హరితహారం, కంటి వెలుగు లాంటి అనేక పథకాలు విజయవంతంగా ||అమలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొనే సమావేశాలతో | సహా ఎస్ హెచ్ జి మహిళలను హాజరు పరుస్తున్నారు. ఒక ఉద్యోగికి స్పష్టమైన జాబ్ చార్ట్ లేకపోవడం కేవలం ఐకెపి విఓఏలకే చెందుతుంది. ఇంత వెట్టి చాకిరీ చేస్తున్నా || కేవలం రూ.3,900/-లు గౌరవ వేతనం సెర్ఫ్ నుండి చెల్లించడం అన్యాయం. ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలు ఉద్యోగ కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్, ఐకెపి వి ఓ ఏ ల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 05:22PM