నవతెలంగాణ - కంటేశ్వర్
నగరంలోని ఆర్యనగర్ గూడెంకి చెందిన మేకల శ్రావణి అనే మహిళ నుంచి శుక్రవారం మధ్యాహ్నం బంగారు గొలను, చేతిలో సెల్ ఫోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు 4వ టౌన్ ఎస్సై సందీప్ తెలిపారు. ఎవరైతే చైన్స్ మ్యాచింగ్కు ఇద్దరు వ్యక్తులు పాల్పడ్డారు. ఆ వ్యక్తుల ముఖచిత్రాలను శనివారం విడుదల చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. రోజూ లాగే హౌజింగ్ బోర్డు కాలనీలో ట్యూషన్ చెప్పి నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గమధ్యలో అమరవీరుల పార్కు వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యాక్టివాపై వచ్చి ఆమె చేతిలోని మొబైల్ ఫోన్, మెడలోని అర తులం బంగారు గొలుసు లాక్కుని వెళ్లారని తెలిపారు. శ్రావణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సె తెలిపారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:19PM