నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
కర్ణాటక రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడుతూ బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించి తగిన గుణపాఠం చెప్పారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మార్క అనిల్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. దేశవ్యాప్తంగా సబండ వర్గాల ప్రజలను నిలువు దోపిడీ చేస్తూ బిజెపికి అనుకూలంగా ఉన్న కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు దోచి పెడుతున్నరని అన్నారు. ఆనాడు బానిసత్వంలో బ్రిటిష్ పరిపాలన ఎలా సాగిందో నేటి బిజెపి పాలన ప్రజలను బానిసత్వంలోకి మళ్లీ నెట్టేలా కొనసాగుతుందని అన్నారు. కర్ణాటకలో దోపిడీ చేసిన ప్రజాధనంతో ప్రభుత్వాన్ని కులగొట్టి గద్దెనెక్కిన బిజెపి అరాచకాలకు అవినీతి పాలనకు విసికి పోయిన కర్ణాటక ప్రజలు ఎన్నికల సమయం ఎప్పుడు వస్తుందని ఎదురు చూశారన్నారు. కన్నడ ఎన్నికల్లో బిజెపి అవినీతి పాలన అంతమవడంతో కర్ణాటకలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. బీసీల హక్కులను కాలరాస్తూ అన్ని రంగాలలో విభజించి పాలిస్తు వివక్షతో వ్యవహరిస్తున్న బిజెపిని బీసీలంతా ఒకటై కర్ణాటకలో ఓడిచ్చినట్టుగానే దేశంలో కూడా ఓడించాలని కోరారు
Tue April 01, 2025 02:09:08 am
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:27PM