నవతెలంగాణ - గోవిందరావుపేట
ఇల్లు మీద ఇల్లు కట్టిన బైక్ వదిలి కారుకొన్న పసరా పంచాయతీ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని పసరా నాగారం వాసులు అంటున్నారు. వీధుల్లో వీధిలైట్లు వెలగక అంధకారం కొనసాగుతోంది.
పరిసరాల్లో మురుకునీరుతో నిండి పారిశుధ్యం కొరవడింది. పసరా గ్రామానికి ఏమైంది అని అడిగేవారికి ఇక్కడ సమాధానం దొరుకుతుంది. మండలంలో అతిపెద్ద పంచాయితీ పసర నాగారం. ఇతర పంచాయతీలతో పోలిస్తే అత్యధిక ఆదాయం కలిగి ఉన్న పంచాయతీ కూడా ఇదే. కానీ ఎందుకు ఇక్కడ అభివృద్ధి కనబడడం లేదు. అంటే కొందరేమో రాష్ట్రంలో పరిపాలనలో బిఆర్ఎస్ పార్టీ ఉండగా ఇక్కడ కాంగ్రెస్ ప్రాతినిధ్యం ఉన్నందున అభివృద్ధి ఆశించినంత మేర లేదని అంటున్నారు. చల్వాయిలో కేవలం సుమారు 2000 మీటర్ల లోపు గోవిందరావుపేట లో సుమారు 2500 మీటర్లలోపు మాత్రమే సీసీ నిర్మాణాలు జరగాల్సి ఉంది. కానీ పెసరలో సుమారు 5 వేల మీటర్ల పరిధిలో సీసీ రహదారుల నిర్మాణాలు జరగకుండా ఉన్నాయని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తుంది. అధిక ఆదాయం అధిక జనాభా అత్యధికంగా వివిధ పార్టీల నాయకులు ఉన్న అభివృద్ధికి ఎందుకు ఆటంకం ఏర్పడుతుందో అర్థం కావడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వెలగని విద్యుత్ వీధి దీపాలతో ముక్కు మూసుకుని దుర్గంధపు వాసనలతో ఇంకా ఎంతకాలం పసర నగర ప్రజలు ఇబ్బందులు పడాలు అర్థం కాని పరిస్థితిలో నెలకొన్నాయని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. పలు రాజకీయ పార్టీల నాయకుల సమన్వయ లోపం వల్లే సిసి రహదారుల నిర్మాణంలో ఆటంకాలు ఏర్పడ్డాయని కొందరు నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేకపోలేదని అంటున్నారు. ఒకసారి ప్రజా ప్రతినిధులు ఎన్నికలకు రాకముందు ఇచ్చిన హామీలు ఎంత మేరా అమలు చేశామన్నది నెమరు వేసుకోవాలని ఓటర్లు కోరుకుంటున్నారు. స్వల్ప కాల వ్యవధిలో మళ్లీ ఓట్లు రానినందున ఇచ్చిన హామీలను నూటికి 90 శాతం నిలబెట్టుకొని ప్రజల్లోకి రావాలని ఆశిస్తున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమని అంటున్నారు. ఇప్పటికైనా సమయం మించి పోలేదని ఇకనైనా అభివృద్ధి పై దృష్టి సాధించాలని సూచిస్తున్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:32PM