నవతెలంగాణ - డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలోగా శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిసినట్లు ఎంపిటిసి చింతల దాస్, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ధర్పల్లి ప్రభాకర్,ఆలయ అభివృద్ధ కమిటీ చైర్మన్ చెక్ పావర్ ఎర్రోళ్ల సాయన్న లు తెలిపారు.చివరి రోజు శాశ్వత సభ్యులకు ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత కొన్ని రోజులుగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా, శాంతి సామరస్యం తో నిర్వహించామని, దిన్ని తిలికించడానికి గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు వారు తెలిపారు.దినికి సహకరించిన గ్రామస్తులకు, యువకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గుప్తా, సతిష్, తోపాటు గ్రామ, అలయ అభివృద్ధి కమిటీల సభ్యులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:38PM