నవతెలంగాణ - గోవిందరావుపేట
కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వస్తుందని టిటిసి కార్యదర్శి పైడాకుల అశోక్ అన్నారు.శనివారం గోవిందరావుపేట మండల కేంద్రం మరియు పస్రా గ్రామాల్లో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపుపై హర్షం వ్యక్తం చేస్తూ మండల నాయకుల సమక్షంలో బాలసంచా పేలుచుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టీపీసీసీ కార్యదర్శి పైడాకుల అశోక్ విచ్చేసి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు ప్రజల గెలుపు అని, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే పునరావృతం అవుతుందని అన్నారు.వ్యతిరేక ప్రభుత్వాలకు ప్రజలు ఎలా బుద్ధి చెపుతారో కర్ణాటక రాష్ట్రం నిరూపించింది అని, అధికార బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం నిజంగా అద్వితీయమని అన్నారు. దేశంలో నియంతృత్వ పాలన సాగిస్తూ మతాలు, కులాల మధ్యన చిచ్చు పెడుతున్న బీజేపీ ప్రభుత్వానికి కర్ణాటక ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, తెలంగాణ రాష్ట్రంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెబుతూ, పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీకి పెద్ద పీట వేస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకునే అవకాశం ఉందని అన్నారు. యువత భవిష్యత్తుని నాశనం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ పాలనకు కర్ణాటక ప్రజలు సరైన గుణపాఠం తెలిపారని, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు ప్రజల గెలుపు అని, తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విజయాన్ని పునరావృతం చేస్తారని ఆశిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలతో టపాసులు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.సి.సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, ఎన్.ఎస్.యూ.ఐ.జిల్లా అధ్యక్షులు మామిడిశెట్టి కోటి, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, కిసాన్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల ప్రభాకర్, మహిళ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పడిగ పార్వతి, జిల్లా నాయకులు కణతల నాగేందర్ రావు, పాలడుగు వెంకటకృష్ణ, జెట్టి సోమయ్య, సూదిరెడ్డి జనార్దన్ రెడ్డి, పాశం మాధవ రెడ్డి, ఎంపీటీసీ గోపిదాసు ఏడుకొండలు, బీసీ సెల్ అధ్యక్షులు కాడబోయిన రవి, పడిదల సాంబయ్య, మద్దాలి నాగమణి, చింత క్రాంతి, సర్పంచులు ముద్దబోయిన రవి, గ్రామ అధ్యక్షులు రామచంద్రపు వెంకటేశ్వర్ రావు, బద్దం లింగారెడ్డి, వేల్పుగొండ ప్రకాష్, జంపాల చంద్రశేఖర్, పాలెం యాదగిరి, మిరియాల యాదగిరి రెడ్డి, కొల్లు శ్రీనివాస్ రెడ్డి, మేడ సైది రెడ్డి, , చేరుకుల సురేష్, జక్కు రణదీప్, గాంధర్ల వేణు, తండా రవి, తండా కృష్ణ, చింతపండు లక్ష్మీ నారాయణ, సామ సమ్మిరెడ్డి, సామ వెంకట్ రెడ్డి, సూదిరెడ్డి జయమ్మ, పులుసం లక్ష్మీ, చొప్పదండి వసంత, రమ, తదితర నాయకులు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 06:56PM