నవతెలంగాణ-డిచ్ పల్లి
మతతత్వ పార్టీకి కన్నడ ప్రజలు బొందపెట్టి తీర్పు నిచ్చారని ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నుకోబడిన సర్కార్ను కూల్చి గద్దెనెక్కి హైదేండ్ల పాలనలో అంతులేని అవినీతి, మతతత్వం హెచ్చరిల్లడంతో అక్కడి ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కులగొట్టి సరేనా తీర్పునిచ్చారని ఇందల్ వాయి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, కిసాన్ ఖేత్ మండల అధ్యక్షులు ఎల్ఐసి గంగాధర్ లు అన్నారు. కర్ణాటక ఫలితాల అనంతరం శనివారం సాయంత్రం ఇందల్ వాయి బస్టాండ్, అంబేద్కర్ విగ్రహం వద్ద డాపాసులు పేల్చి ఉత్సవాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్ని అడ్డంకులు సృష్టించిన ప్రజలు బీజేపీని చీకొట్టారని రాబోవు రోజుల్లో కేంద్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ఎన్నికలు ఎప్పుడు ఎప్పుడు అని ప్రజలు ఎదురుచూస్తున్నారని వచ్చినప్పుడు సరైన రీతిలో వారి నిర్ణయం ఉంటుందన్నారు. బీజేపీ అరచక పాలనకు అక్కడి ప్రజలకు ఇకనుండి విముక్తి కలిగిందని అన్నారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని దేశ ప్రజలు సోనియాగాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, సుధాకర్, హబీబ్, నూరు, తో పాటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 13 May,2023 07:21PM