- పాఠశాల చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ
- చూసి చూడనట్లు అధికారుల
నవతెలంగాణ - డిచ్ పల్లి
నాణ్యత నీ చిరునామా ఎక్కడా...!
పాఠశాల చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ లో నాణ్యత ప్రమాణాలు పాటించాకుండనే పనులను చేసేస్తున్నారు.ప్రతి రోజు పర్యవేక్షించే అదికారులు ఆ వంక చూసి చూడనట్లు వ్యవహరించడంతో నాణ్యత కొరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ లకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రభుత్వం ఒక మంచి సదుద్దేశంతో ప్రజలు, విద్యార్థుల ఇబ్బందులు తీర్చడానికి నిధులను మంజూరు చేస్తుంది. కంట్రాక్టర్ లు చేపట్టే పనుల్లో నాణ్యత కరవవుతోంది. ఓ ప్రణాళిక అంటూ లేకుండా తమ ఇష్టానుసారం గా పనులు చేస్తూ హమ్మయ్య పనైతే పుర్తి చేశామని ఊపిరి పిల్చుకుని అదికారులు, కార్యాలయల చుట్టూ తిరుగుతు ఎంబి రికార్డులు చేసుకోని డబ్బులు సంపదించు కుంటున్నారు. నీదులు మంజురైన వేంటనే ప్రజా ప్రతినిధులు కమీషన్ల రూపంలో తమకు ఎంత ముట్టజేప్తరనే విషయమై పలువురు కాంట్రాక్టర్లకు ఎరికోరి పనులను అప్పగించి తమ జేబులు నింపుకోవడమే పరమ వాదిగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.దినికి పర్యవేక్షణ చేసే అదికారులు సైతం పచ్చ జెండా ఊపడం.. ఆఘమేఘాల మీద ఎంబిలు చేయడం చక చక జరిగిపోతూనే ఉన్నాయి. నిర్మిస్తున్న ప్రహారీ లో ఇటుకలు ఇప్పుడే ఉడుతున్నయని, సిమెంట్ కుడా సరిగా వాడటం లేదని ఇదేనా పనులు చేసే తిరని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పనులే ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి."మన ఊరు మన బడి' పథకం కింద ఇందల్ వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికైంది.దినికి దాదాపు రూపాయలు 80 లక్షలు మంజూరు అయిన ప్రహారీ నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులను చేపట్టారు. పాఠశాల చుట్టూ
ప్రహరీ నిర్మాణం కోసం రూ.33 లక్షలు, మైదానం చదును ఇతర పనులు చేస్తున్నారు.
మరుగుదొడ్లు, మూత్రశాలలు వృథేన..?
2017-18లో లక్షల రూపాయలతో బాల బాలికలకు వేర్వేరుగా నిర్మించిన మరుగుదొడ్లు, మూత్రశా లలు వృథాగా మారనున్నాయి. అనాడు ఖాలీ స్థలం ఉండటం, ప్రహారీ లేకపోవడంతో పనులను కానిచ్చారు. ఇప్పుడు చేసే పని అదికారులు దేగ్గర ఉండి మైదాన లో ఎంత మేర మోయు వేయాలి, ప్రస్తుతం లక్షలు రూపాయలతో అనాడు నిర్మించిన మరుగుదోడ్లు, మూత్రశాలలకు ఉపయోగించే విధంగా ఒక ప్రణాళిక ప్రకారం చేయాల్సి ఉండగా ఎక్కడా అమలైన దాఖలాలు కనబడటంలేదు. మైదానం మొత్తం లో నలువైపులా మొరం వేయడంతో మరుగుదొడ్లు, మూత్రశా లు సగం వరకు మునిగిపోయి వినియోగానికి పనికి రాకుండాపోయాయి. అధికారుల ప్రణాలిక లోపంతో ప్రజాధనం వృధాగా మారిపోయింది. ఇది గమనించిన గ్రామస్తులు జరుగుతున్న పనులపై ఆగ్రహం వ్యక్తం చేస్తు నిర్మించిన ప్రహారీ లో నాణ్యత లోపం ఉందని, ఇప్పుడే ఇటుకలు ఉడిపోతున్నయని, వాటిని తోలగించి నాణ్యతతో కూడిన పనులను చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
నిబంధనలకు తుట్లు...
ప్రభుత్వం మంజూరు చేసే ఏదైనా పనిలో నియామ నిబంధనలు పాటించాలని,దాని ప్రకారమే పనులు చేయాల్సి ఉండగా నాణ్యత లేని, ఇసుక,మోరం,కంకర,స్టిల్, సిమెంట్ ఇతరత్రా వాటన్నింటిని పక్కకు పేట్టి నాణ్యత ప్రమాణాలు లేని ఇసుక కు తక్కువ దరకు లాబించే వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజాధనం ను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో సిమెంట్ తక్కువగా వినియోగిస్తున్నాట్లు స్పష్టంగా కనిపిస్తుంది.ఇలాంటి నాణ్యత లేని పనులు చేపట్టడంతో ప్రభుత్వానికి చేడ్డ పేరు వాస్తుందని, ప్రభుత్వం అభివృద్ధి పనులకోసం లక్షల కోట్లు మంజూరు చేస్తున్న పనుల్లో నాణ్యత ప్రమాణాలు కోరబడి, అదికారుల పర్యవేక్షణ లోపంతో కోందరు కాంట్రాక్టర్ లకు తాము ఆడిందే అటగ పాడిందే పాటగా మారి జేబులు నింపుకుంటున్నారు. భావి భారత పౌరులను తీర్చిదిద్దే నిల యాన్ని ఎంతో అపురూపంగా మలచాల్సింది పోయి.. అక్రమ సంపాదనకు మార్గంగా విని యోగించుకోవడంపై విమర్శలు వెలువడుతు న్నాయి. నిధులు లేక చాలాచోట్ల వసతులు మృగ్యమవుతుంటే.. ఇక్కడేమో ఇలా సర్కారు సొమ్మును వృదా చేయడంపై గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక అధికారుల నిర్లక్ష్యం, జిల్లా యంత్రాంగం పర్యవే క్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం తో పనుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
ప్రభుత్వ పని ఏదైనా అంతే...!
సిసి, బిటి రాహదరులు, డ్రైనేజ్, కమ్యూనిటీ భవన నిర్మాణాలు, ఇతరత్రా అభివృద్ధి పనులు నిర్మాణానల పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాకుండనే పనులను పూర్తి చేస్తున్నారనే విమర్శలున్నాయి.ఎ గ్రామంలో చుసిన లక్షలు, కోట్లా రూపాయలను ప్రభుత్వం పలు అభివృద్ది కార్యక్రమాలకు నీధులను మంజూరు చేస్తుంది.ఒక కాంట్రాక్టర్ లు,ఇంకో పక్క ప్రజా ప్రతినిధులు పనులను చేపట్టడంతో నాణ్యత కోరవడిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ ఉద్దేశం బాగున్నా క్షేత్ర స్థాయిలో జిల్లా,మండల అధికారుల పర్యవేక్షణ లోపంతో నే పనులు పూర్తి చేస్తున్నారనే వాదనలు లేకపోలేదు.