- శ్రమజీవులు ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు...
- వారి కృషితోనే జాతీయ స్థాయిలో పంచాయతీలకు అవార్డులు
నవతెలంగాణ - డిచ్ పల్లి
పంచాయతీరాజ్ శాఖలో 2015లో ఈ పంచాయతీ వ్యవస్థ ప్రారంభమైన నుండి నేటి వరకు గ్రామపంచాయతీకి సంబంధించిన జనన, మరణ నమోదులు, టాక్స్ వివరములు, అనుమతులు, వృత్తి, వ్యాపార లైసెన్స్ జారి, గ్రామ పంచాయతీకి సంబంధించిన చెక్కుల జారి, ఆన్లైన్ లావాదేవీలు, గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు, ఈ పంచాయతీ పోర్టల్లో గ్రామపంచాయతీ వివరములు నమోదు, నెలవారీగా రిపోర్టులు క్రోడీకరణ, ఈ గ్రామ స్వరాజ్ పోర్టల్లో గ్రామపంచాయతీ వివరములు నమోదు, ఆన్లైన్ ఆడిట్, నెలవారి మాస నివేదికలు తయారు వంటి సేవలు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు నిర్విరామంగా తమ సేవలను కొనసాగిస్తున్నారు. అంతే కాకుండా ఎన్నికల సమయంలో, దళిత బంధు డాటా ఎంట్రీ సమయంలో, కరోనా వ్యాక్సిన్, సబ్సిడీ రుణాలు, ప్రభుత్వం అందజేసే ఇతర సబ్సిడీ పథకల సమయంలో విరి కృషి అమోఘం అనిర్వచనీయం గా ఉంటుంది. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి పనిలో ఉన్నతాధికారుల ఆదేశానుసారం విధులు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వ పరంగా వారికి కనీస గుర్తింపుకు నోచుకోక ఎన్ని ఇబ్బందులు ఉన్న నోరు మేదపక మిన్నకుండి పోతున్నారు. ఒక్కో కంప్యూటర్ ఆపరేటర్ 4 నుండి 6 గ్రామపంచాయతీల వరకు అన్ని తమై చూసుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లాలోని 27 మండలలకు గాను 85మంది కంప్యూటర్ ఆపరేటర్లు ఉండగా, కామారెడ్డి జిల్లాలోని 22మండలలకు గాను 63మంది కంప్యూటర్ ఆపరేటర్లు విదులు నిర్వహిస్తున్నారు
2015 లో అపరేటర్లు విధుల్లో చేరినప్పుడు 8,వేల500వేతనం అందజేసే వారు 2021లో పంచాయతి రాజ్ కార్యాలయం నుండి వచ్చిన సర్కులర్ ఆధారంగా కంప్యూటర్ ఆపరేటర్లకు నేలకు19,వేల500రూపాయల వేతనం అందజేస్తున్నారు.ఈ వేతనాన్ని ఈ పంచాయతీ మేయింటేనేన్స్ కింద10% ఖాతాలో జమ చేసి ఎంపివో లో ద్వారా అందజేస్తున్నారు.రాష్ట్ర స్థాయిలో సుమారుగా 1300 మంది కంప్యూటర్ ఆపరేటర్లుగా విదులు నిర్వహిస్తున్నారు.అసలు ప్రతి గ్రామ పంచాయతీ లో ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఉండవల్లి ఉండగా మండలం మొత్తం లో 3,4,5 మాత్రమే మొత్తం మండలంలోని అన్ని గ్రామాలకు చేయించిన వాటిని చుసుకోవల్సి ఉంటుందని కాని పనికి తగ్గ వేతనం మాత్రం అందడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సకాలంలో నివెదికలను ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశానుసారం రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడుతున్నా శ్రామకు తగ్గ ఫలితం దక్కడం లేదు.గత కొన్ని ఏళ్లుగా రాష్ట్రానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో పంచాయతీ లకు అవార్డులు వస్తున్నాయంటే దానికి మూల కారణం కంప్యూటర్ ఆపరేటర్ లాదే ప్రధాన భూమిక పోషిస్తున్నారు. అయినప్పటికీ వీరికి కనీస ఉద్యోగ భద్రత లేకుండా శ్రమకు తగ్గ తగిన వేతనం లేకుండా, శ్రమ దోపిడీకి గురవుతునే ఉన్నారు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులు సమ్మెబాట పట్టినప్పటికీ గ్రామపంచాయతీ సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉన్నతాధికారుల ఆదేశానుసారం విధులను నిర్వహిస్తున్నారు.
పనిభారం ఎక్కువైనన్నప్పటికి ఎలాంటి ఆటంకం, ఇబ్బందులు ఏర్పడకుండా తమ పని తాము చేసుకోని పోతున్నారు.ఇవ్వళ కాకున్నా వచ్చే రోజుల్లో నైనా ప్రభుత్వం, జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులు మేము చేస్తున్న సేవలను గుర్తించక పోతార ? అనే విషయం పై ఎన్ని గంటలైనా పనులను సకాలంలో నివెదికలను తయారు చేసితమ పై అధికారుల కు అందజేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీరి సేవల్ని గుర్తించి వేతన చట్టం అమలు చేసి, ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించి మరింత ప్రోత్సాహం కల్పించే విధంగా చూడాలని కంప్యూటర్ ఆపరేటర్లు కోరుతున్నారు.
ఉత్తమ గ్రామపంచాయతి లుగా అవార్డు రావటానికి, ఈ పంచాయతీల సేవలే కారణం...!
రాష్ట్ర ప్రభుత్వం2015లో ఈ పంచాయతి సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినప్పటి నుండి గ్రామ పంచాయతికి వచ్చే పల్లే ప్రగతి, పంచాయతీ సెక్రటరీ పర్ఫామెన్స్, కరెంట్ బిల్లులు, ఆదాయం, వసూలు, గ్రామపంచాయతీకీ వ్యయాలు, ఇంటి నిర్మాణ అనుమతులు, ఇంటిపన్ను, నల్లపన్ను, జనన, మరణాల సర్టిఫికెట్, ఇతరత్రా లకు సంబంధించిన రికార్డులన్నీ సకాలంలో అందజేయడానికి, గ్రామాల్లో ఉన్న ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈపంచాయతి ఆపరేటర్లు ఎంతగానో కృషిచేస్తునే ఉన్నారు. గత కొన్ని రోజులుగా పంచాయతి కార్యదర్శులు సమ్మె చేస్తున్నప్పటికీ, ప్రభుత్వ ఆదేశాల మేరకు వారిస్థానంలో సీనియర్ పంచాయతీ కార్యదర్సులు, జెపిఎస్, ఒపిఎస్ లకు అధనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు తీసుకొని గ్రామపంచాయతికి సంబం ధించిన నమోదు పనులలో ఎలాంటి ఆటంకం కలగకుండా, ఈ పంచాయతీ ఆపరేటర్లు నిర్వీరమంగ పనిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చేస్తూ అదికారుల, ప్రజా ప్రతినిధుల నుండి ఈ పంచాతీయతి ఆపరేటర్లు మన్ననలు పొందుతున్నారు. ఆన్లైల్లో సేవలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా అంతరాయం కలుగకుండా ఉన్నతాధికారులకు ఎప్పడికప్పుడు నివేదికలు అందజేస్తు ఉన్నారు.
Mon Jan 19, 2015 06:51 pm
- మీరు ఇక్కడ ఉన్నారు
- ➲
- హోం
- ➲
- తెలంగాణ రౌండప్
- ➲
- స్టోరి
- 14 May,2023 04:59PM